Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 September 2024, 5:30 pm Posted by : ramakrishna

మన జీవితానికి పునాది వేసేవాడే గురువు

బతుకమ్మ,మోర్తాడ్: మన జీవితానికి పునాది వేసేవాడు… మన ఆశయానికి ఆయువు పొసేవాడు మన గురువు మాత్రమే అని డొంకల్ ఎస్ బి ఐ బ్యాంక్ మేనేజర్ మనోహర్ అన్నారు. మోర్తాడ్ మండలం షెట్పల్లి గ్రామంలో జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి పాఠశాల ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులకు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్, ఉపాధ్యాయులు సుదర్శన్, రవి, శంకర్, శ్రీనివాస్ బాలు, గోదావరి, అన్నపూర్ణ, విజయ కుమారి,సుమిత్ర తదితరులు పాల్గొన్నారు.

Guru is the foundation of our life