Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 October 2024, 1:20 pm Posted by : ramakrishna

గురు బసంత్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన పోచారం

బాన్సువాడ , బతుకమ్మ:   

స్వర్గీయ గురు బసంత్ స్మారక సీనియర్స్ క్రికెట్ టోర్నమెంట్ ను బాన్సువాడ శాసన సభ్యుడు,రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ లు ప్రారంభించారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లో అదివారం ఉదయం జరిగిన క్రికేట్ టోర్నినీ  బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. ముందుగా స్వర్గీయ గురు బసంత్ చిత్రపటానికి పూలమాలలు వేసి వారందరి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారుడిగా, విద్యావేత్తగా, గురు బసంత్ సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. బసంత్ జ్ఞాపకార్థం క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అంజిరెడ్డి,కృష్ణారెడ్డి, ఖలైక్, ఎజజ్, క్రీడాకారులు బాల్ నాథ్,దేవేందర్,రమణ ,  అయాజ్,అమీన్, వజిడ్, ఫైసల్ తదితరులు పాల్గొన్నారు…

Guru Basant Cricket Tournament was inaugurated