- అంతర్జాతీయ ప్రచారకులు అందె జీవన్ రావు
న్యూడీల్లి, బతుకమ్మ : విద్యార్ధి దశలో విద్యార్థులకు శిక్షగా ఉపాధ్యాయులు తీయించే గుంజిళ్ళు ఇప్పుడు సూపర్ బ్రెయిన్ యోగగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని గుంజిళ్ళు అంతర్జాతీయ ప్రచారకులు అందె జీవన్ రావు అన్నారు. మంగళవారం ఆయన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని జమ్మూ పట్టణం లోని రాయిపూర్ ఇనిస్టిట్యూట్ అఫ్ ఆయుర్వేద అండ్ రిసర్చ్ సెంటర్ లో కృతిమ మేధా, సూపర్ బ్రెయిన్ యోగ అనే అంశం పై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సూపర్ బ్రెయిన్ యోగ గుంజిళ్ళ సాధన, వాటి ప్రయోజనాలను గురించి పవర్ పైన్ట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మన భారత దేశానికే పరిమితమైన ఈ గుంజిళ్ళు విశ్వ వ్యాప్తంగా సాధనగా మారిందన్నారు.ఈ సూపర్ బ్రెయిన్ యోగ ద్వారా జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, శ్రద్ధ, సృజనత్మాకత పెరిగి సమస్య పరిష్కారం లభిస్తుందని అన్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనల నుండి ఉపశమనం లభిస్తుందని తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగ లో ఉన్న అనుమానలను నివృత్తి చేసిన ఆయన వారితో 14 రౌండ్లు గుంజిళ్ళు( ఉత్తక్ బైఠక్ ) తీయించారు. ఈ కార్యక్రమం లో డాక్టర్. పూనమ్, డాక్టర్. పల్లవి దూబె, డా. రాధికా గుప్త, డా. రఫియా, డా. రాజీవ్ సింగ్, డా. అర్జున్ గుప్తాలు పాల్గొన్నారు.