Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 June 2025, 12:22 pm Posted by : ramakrishna

సిగరెట్ ఉద్దెర ఇవ్వలేదని గన్ తో కాల్పులు

వెబ్ న్యూస్, బతుకమ్మ: సిగరెట్ ఉద్దెర ఇవ్వలేదనే కోపంతో ఓ యువకుడు దుకాణ యజమానిపై గన్ తో కాల్పులు జరిపాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లో గత నెలలో చోటు చేసుకోగా పోలీసులు నిందితుడిని తాజాగా అరెస్ట్ చేశారు. ఆదిత్య అనే యువకుడు సురజిత్ మావే కు చెందిన కిరాణా దుకాణాకి వెళ్లి సిగరెట్ ఉద్దెర అడిగాడు. దీంతో సురజిత్ రూ.250 అప్పటికే ఇవ్వాల్సి ఉందని ఆదిత్యకు గుర్తు చేసి సిగరెట్ ఇవ్వలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆదిత్య గన్ తీసుకువచ్చి కాల్పులు జరిపాడు. సురజిత్ ప్రాణాలతో బయటపడ్డాడు.