విదేశాలకు పంపిస్తానని గల్ఫ్ ఏజేంట్ మోసం
పోలీసులను ఆశ్రయించిన బాధితుడు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తనను విదేశాలకు పంపిస్తానని డబ్బులు తీసుకొని నాలుగేళ్లైనా పంపించడంలేదని, తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే తనపై గల్ఫ్ ఏజెంట్ తన అనుచరులతో దాడి చేశారని ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురానికి చెందిన నరసింహమూర్తి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని ఐలాపూర్ గ్రామానికి చెందిన కస్పా శ్యామ్ అనే గల్ఫ్ ఏజెంట్ తనను విదేశాలకు పంపిస్తానని చెబితే డబ్బులు చెల్లించానని బాధితుడు తెలిపారు. నాలుగేళ్లయినా తనను విదేశాలకు పంపకపోవడంతో...