Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 February 2025, 7:11 pm Posted by : ramakrishna

విదేశాలకు పంపిస్తానని గల్ఫ్ ఏజేంట్ మోసం

  • పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తనను విదేశాలకు పంపిస్తానని డబ్బులు తీసుకొని నాలుగేళ్లైనా పంపించడంలేదని, తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే తనపై గల్ఫ్ ఏజెంట్ తన అనుచరులతో దాడి చేశారని ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురానికి చెందిన నరసింహమూర్తి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని ఐలాపూర్ గ్రామానికి చెందిన కస్పా శ్యామ్ అనే గల్ఫ్ ఏజెంట్ తనను విదేశాలకు పంపిస్తానని చెబితే డబ్బులు చెల్లించానని బాధితుడు తెలిపారు. నాలుగేళ్లయినా తనను విదేశాలకు పంపకపోవడంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఐలాపూర్ గ్రామానికి వచ్చి కోరానని తెలిపారు. దీంతో తమ పై ప్రకాష్, మధు, సాయి రెడ్డి అనే ముగ్గురు వ్యక్తులతో కలిసి దాడి చేసి తనను ఇష్టమొచ్చినట్లు బూతు మాటలు తిట్టారని అన్నారు. తమ పై దాడి చేసిన వ్యక్తులతోపాటు ఏజెంట్ కస్పా శ్యామ్ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.