విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని కోటగల్లి శంకర్ భవన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బడి బాటలో భాగంగా ఈనెల 13న శుక్రవారం నూతనంగా పాఠశాలలో నమోదైన విద్యార్థులచే సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలవేసి పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి కోటగల్లి కాంప్లెక్స్ హెడ్మాష్టార్ మల్లేశం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలకు కొత్త పలకల మీద అ ఆ దిద్దించారు.బడిఈడు పిల్లల్ని బడికి పంపాలని తల్లిదండ్రులను కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో...