మెండోరా, బతుకమ్మ:మెండోరా మండలంలోని సావెల్ గ్రామంలో దోనుపాల కిరణ్ గ్రూప్ 1 అధికారి గా సెలెక్ట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారిగా రేవంత్ రెడ్డి నాయకత్వం లోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రూప్ 1 లో విజయం సాధించిన దోనుపాల కిరణ్ కు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ గా నియమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా హైదరాబాద్ శిల్ప కళా వేదిక లో నియామక పత్రం అందుకోనున్నారు. దీంతో గ్రామంలో కుటుంబ సభ్యులు స్నేహితులు గ్రామస్తులు మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు.