గ్రూప్-1 పరీక్ష పేపర్లను రీవాల్యూయేషన్ జరిపించాలి

హైకోర్టులో  అభ్యర్థుల పిటిషన్ వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష పేపర్లను రీవాల్యూయేషన్ జరిపించాలని గ్రూప్- అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్-1 మూల్యాంకనం లోప భూయిష్టంగా జరిగిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ల వాదనలు ధర్మాసనం టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేసింది.