Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 7:39 pm Posted by : ramakrishna

మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ

 

లింగంపేట్, బతుకమ్మ :

 

లింగంపేట మండలంలోని లింగంపల్లి గ్రామంలో మహిళా సంఘ భవనం నిర్మాణానికి గ్రామ సర్పంచ్ ప్రత్యూష సాయిరాం గోకుల్ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు సహకారంతో గ్రామంలో మహిళా సంఘ నూతన భవ నిర్మాణానికి 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించినట్లు సర్పంచ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేసిందన్నారు. మహిళల సాధరికతను సాధించడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు శారద, పంచాయతీ కార్యదర్శి భవాని, సిసి మన్సూర్, మహిళా సంఘాల సభ్యురాలు పాల్గొన్నారు.