ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ
బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీ లోని 13వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు భూమిపూజ చేశారు. ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్దిదారులకు కొలతలు వేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సకాలంలో ఇల్లు పూర్తి చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం పొందాలని కోరారు. పేదల సొంతింటి కల నెరవేర్చందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో 13వ వార్డు కాంగ్రెస్ నాయకులు గౌస్ పాషా,ఇందిరమ్మ గృహ నిర్మాణ ఏఈ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.