Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 October 2025, 4:40 pm Posted by : ramakrishna

రాజీవ్ నగర్ తండాలో ఏకచక్ర గోశాలకు భూమి పూజ

 బతుకమ్మ బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం రాజీవ్ నగర్ తండాలో ఏకచక్ర గోశాల స్థాపన కోసం నాలుగు ఎకరాల భూమిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గతంలో హామీ ఇచ్చి కేటాయించారు. ఆ భూమిపై శుక్రవారం రోజున భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు నేపాల్ సింగ్, వినోద్ పట్వారి మరియు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంఘం చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఎమ్మార్వో విట్టల్, ఏసీపీ శ్రీనివాస్, ప్రముఖ నాయకులు గంగా శంకర్, దాము  నాగేశ్వరరావు, పాషా, మయునుద్దీన్, శరత్ రెడ్డి, ఆలయాల చైర్మన్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గోశాల నిర్వాహకులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

Groundbreaking ceremony for one-wheeled cowshed in Rajiv Nagar Thanda