Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 October 2025, 2:12 pm Posted by : ramakrishna

అయ్యప్ప స్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు భూమి పూజ

 ఎల్లారెడ్డి, బతుకమ్మ :  పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో  అభివృద్ధి పనులకు బుధవారం పైడి ఎల్లారెడ్డి భూమి పూజ చేవారు.  అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో భక్తులకు ఎదురవుతున్న సమస్యలను దష్టిలో ఉంచుకొని  అవసరమైన బాత్‌రూమ్‌ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించామన్నారు.  రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను ప్రాధాన్యంగా తీసుకొని గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నానన్నారు. . కామారెడ్డి జిల్లాలోని పలు అయ్యప్ప స్వామి ఆలయాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామన్నారు.  పలు గ్రామాలలో స్వచ్ఛమైన తాగునీటి కోసం వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించానని తెలిపారు.  అన్నసాగర్, వెల్లుట్ల గ్రామాల ప్రజలు కూడా వాటర్ ప్లాంట్ కోసం అభ్యర్థించారని, వారికి త్వరలోనే వాటర్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయనున్నట్టు హామీ ఇచ్చారు. స్వాముల పడి పూజ సమయానికి ఈ సదుపాయాలు సిద్ధంగా ఉండేలా చూడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ ఎంపీపీ నక్క గంగాధర్, మాజీ నాగిరెడ్డిపేట్ ఎంపీపీ రాజ్ దాస్, ఎల్లారెడ్డి మాజీ వైస్ ఎంపీపీ పెద్దోడ్ల నర్సింలు, ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, ఆలయ కమిటీ సభ్యులు మరియు పలువురు భక్తులు పాల్గొన్నారు.

Groundbreaking ceremony for development works at Ayyappa Swamy temple