Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 6:55 pm Posted by : ramakrishna

గ్రామ సంఘాల భవనాల నిర్మాణానికి భూమి పూజ

 

బాల్కొండ, బతుకమ్మ :

 

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మంగళవారం బాల్కొండ మండలం లో చిట్టాపూర్, బాల్కొండ, కిషన్ నగర్ గ్రామాల్లో గ్రామ సంఘాల భవన నిర్మాణం కొరకు భూమి పూజ నిర్వహించటం జరిగిందని ఏపీఎం గంగారాం అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్టాపూర్ గ్రామం లో గ్రామ సర్పంచ్ ప్రవీణ్, ఉపసర్పంచ్ ఉదయకుమార్, సీసీ సాయన్న, గ్రామ సంఘం అధ్యక్షురాలు హసీనా బేగం, అన్ని సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.