Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 May 2025, 9:10 pm Posted by : ramakrishna

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి భూమి పూజ

బతుకమ్మ, భిక్కనూరు: నిరుపేద కుటుంబాల సొంత ఇంటి కళ నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముందుకు వచ్చిన లబ్ధిదారుల ఇంటిని నిర్మించడానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తుందని ప్రతి ఒక్కరు సొంత ఇంటి నిర్మించుకొవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  మండల కాంగ్రెస్ అధ్యక్షులు భీమ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్దరాములు, మాజి సర్పంచ్ స్వామీ, ఎస్ సి సెల్ మండల అధ్యక్షులు జీవన్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంఆర్ఓ శివప్రసాద్, ఎంపిడిఓ రాజ్ కీరణ్ రెడ్డి, పంచాయతి కార్యదర్శి దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.