Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 7:01 pm Posted by : ramakrishna

మహిళా సంఘాల భవనాల నిర్మాణాలకు భూమి పూజ

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామంలో సుమారు రూ.20 లక్షల నిధులతో రెండు మహిళా భవనాలు నిర్మించేందుకు బుధవారం గన్నారం సర్పంచ్ సుజాత శ్రీనివాస్ చేతుల మీదుగా భూమి పూజ చేశారు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సహకారంతో గ్రామంలో 2 మహిళా భవనాలను నిర్మించడానికి బుధవారం భూమి పూజ చేయడం జరిగిందని స్థానిక సర్పంచ్ సుజాత శ్రీనివాస్ వెల్లడించారు. ఈ మేరకు గ్రామ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి కి గ్రామ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక నిధులతో గ్రామంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడానికి కృషి చేస్తామని సర్పంచ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గాండ్ల బైరయ్య, గంగారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ బద్దం రామ్ రెడ్డి, మల్లేష్ రెడ్డి, తోట భూమన్న, గంగారం, తదితరులు పాల్గొన్నారు.