Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 8:25 pm Posted by : ramakrishna

మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ

 

కమ్మర్ పల్లి, బతుకమ్మ :

 

గ్రామీణ ప్రాంత మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి గ్రామంలో మహిళా సంఘ భవనాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. కమ్మర్ పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో రూ.10 లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న మహిళా సంఘ భవనానికి శనివారం ఆయన భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాల కార్యకలాపాలకు ప్రత్యేక భవనాలు ఎంతో అవసరమని అన్నారు. కమ్మర్ పల్లి మండలంలోని 14 గ్రామాలకు 10 లక్షలు చొప్పున మహిళా సంఘ భవనాలు మంజురయ్యాయని అన్నారు. నర్సాపూర్ గ్రామంలో 32 గ్రూప్ లకు 32 లక్షల రూపాయల పావలా వడ్డీ వచ్చిందని అన్నారు. యూరియా యాప్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి మండల అధ్యక్షులు భాస్కర్, మాజీ అధ్యక్షులు రవి, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, నర్సాపూర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

Ground-breaking ceremony for the construction of the women's association building.