Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2024, 4:29 pm Posted by : ramakrishna

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రత

రుద్రూర్, బతుకమ్మ : లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్, ఆహార శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన కళాశాల ఆధ్వర్యంలో ధాత్రి ఫౌండేషన్ రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, పోలీస్ స్టేషన్ లో బుధవారం పచ్చదనం పరిశుభ్రత, చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ట్రాక్టర్ బ్లేడ్ సహాయంతో స్కూల్ ఆవరణ లోని ఉన్న పనికిరాని చెట్లను గడ్డిని తొలగించి, గుంతలను పూడ్చివేసి నీళ్లు నిలవకుండా మట్టితో స్కూల్ మొత్తం నేలని సరి చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో కూడా గడ్డిని తొలగించి చెట్లను నాటడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలలో 60 మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో రుద్రూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అప్పారావు, హెడ్మాస్టర్ శ్రీనివాసరావు, ఫుడ్ సైన్స్ కాలేజ్ ప్రొఫెసర్ సాయి ప్రసాద్, పోలీస్ స్టేషన్ సిబ్బంది, పాఠశాల సిబ్బంది, లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ సభ్యులు లయన్స్ కెవి మోహన్, లయన్స్ శ్యాంసుందర్ పహాడే, లింగాల శంకర్, ప్రశాంత్ గౌడ్, గాండ్ల మధు, సాయికిరణ్ ఫుడ్ సైన్స్ కాలేజ్ విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.