అమెరికాలో గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్ నిలిపివేత
వెబ్ న్యూస్,బతుకమ్మ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్ కార్డు లాటరీ ప్రోగ్రామ్ ను అమెరికాలో నిలిపేశారు. అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయం రోడ్ ఐలాండ్ లోని క్యాంపస్ లో పరీక్ష జరుగుతుండగా ఓ దుండుగుడు ఇటీవల కాల్పలకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో 8 మంది గాయపడ్డారు. పోర్చుగీస్ దేశానికి ఈదుండగుడు గ్రీన్ కార్డు లాటరీ ద్వారానే అమెరికాకు వచ్చాడు. దీంతో ఈవిధానాన్ని నిలిపివేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.