Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 January 2025, 7:26 pm Posted by : ramakrishna

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్

 

ఇందల్వాయి,బతుకమ్మ: నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ పరిధిలో ఇందల్వాయి మండలానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి కృషితో 22 కోట్ల వరకు నిధులు మంజూరైనట్లు పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరు నవీన్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెల అభివృద్ధి ద్యేయంగా నిధులు మంజూరు చేయడం చేయడం జరుగుతుందన్నారు. అన్ని గ్రామ పంచాయతీలలో ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే ఇందిరమ్మ రాజ్యం కల సహకారం అవుతుందని అన్నారు. రానున్న రోజులలో ఇందల్వాయి మండలానికి స్థానిక ఎమ్మెల్యే సహకారంతో మన మండలానికి మరిన్ని నిధులు తీసుకురావడానికి కృషి చేస్తామని అన్నారు. మండలంలోని నూతన గ్రామపంచాయతీ భవనములు గన్నారం గ్రామపంచాయతీ, మెగ్య నాయక్ తండా, రూప్ల నాయక్ తండ,దేవి తండా,గంగారం తండా,కేకే తండా గ్రామాలకు నూతన భవనాలను నిర్మించడానికి అలాగే అంగన్వాడి సెంటర్లు ఎల్లారెడ్డిపల్లి, గౌరారం నల్లవెల్లి, కేవీ సబ్ స్టేషన్ తిరుమల పల్లి కి మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి గ్రామ శాఖ అధ్యక్షులు ఈర్ల సాహేందర్,సంతోష్ రెడ్డి,నారాయణ, కర్క మోహన్,వసంత్రావు, సుధాకర్, బద్దం రెడ్డి,బాబురావు, శీను నాయక్ డాక్టర్ పరమేష్, జెగ్గ లక్ష్మణ్, గట్టు కడారి, అరిపెల్లి దశరథ్, అంబర్ సింగ్,లక్ష్మి తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.