Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 December 2024, 3:49 pm Posted by : ramakrishna

షెడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో స్థానిక గౌడ సంఘం సభ్యులు ఎల్లమ్మ గుడి నిర్మాణం చేయు స్థలంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో ఎస్డిఎఫ్ నిధులతో 2 లక్షల 50 వేల రూపాయలతో షెడ్డు నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయడం జరిగింది. సోమవారం రోజున స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌడ సంఘం సభ్యులు పూజ కార్యక్రమం జరిపి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడం జరిగింది. ఇట్టి సందర్భంలో గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ మా యొక్క సమస్యను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సునీల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మా యొక్క సంఘానికి నిధులు మంజూరు చేయడానికి కృషిచేసిన స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు బాల్కొండ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో స్థానిక గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేండ్ల రాజారెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్, డిసిసి డెలికేట్ గడ్డం జీవన్ రెడ్డి, కిసాన్ కేత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముస్కు మోహన్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ మెంబర్ పన్నాల నర్సారెడ్డి, ఏలేటి మోహన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దం లింగారెడ్డి, పచ్చిమట్ల శంకర్ గౌడ్ ,పాకాల ప్రసాద్ గౌడ్, అన్నేల మురళి గౌడ్, కోల రమేష్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు,