తడపాకల్ పుష్కర ఘాట్ అభివృద్ధి కై నిధులు మంజూరు చేయండి
ఏర్గట్ల, బతుకమ్మ : రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో తడపాకల్ గ్రామ పుష్కర ఘాట్ లో వసతులు, అభివృద్ధి పనుల కొరకు ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలని తడపాకల్ గ్రామ సర్పంచ్ జింక స్వప్న అనిల్ కుమార్ జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సూచన మేరకు దేవాదాయ అధికారులు ఘాట్ విస్తరణ కొరకు 2.76 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్ధం...