Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 November 2025, 7:53 pm Posted by : ramakrishna

సీఆర్ఆర్ 2025-26 నిధులు మంజూరు చేయండి

  • మంత్రి సీతక్కను కోరిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి

 

సిరికొండ, బతుకమ్మ:  20 కోట్ల సి ఆర్ ఆర్ 2025-26 నిధులు మంజురు చేయాలని మంత్రి సీతక్క కు  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వినతిపత్రం అందజేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం 170 గ్రామపంచాయతీలు, ఏడు మండలాలు ఉన్నాయని, నిజామాబాద్ జిల్లాలో అతిపెద్ద విస్తీర్ణం, రోడ్లను కలిగి ఉందని అన్నారు. గరిష్టంగా ఎస్సీ, ఎస్టీ నివాసాలు  తండా లకు శాశ్వతం బి టీ రోడ్డు లేవని, సరైన రోడ్డు లేకపోవడంతో రవాణా చాలా ఇబ్బంది ఎదుర్కొంటుందని అన్నారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా  గరిష్ట సంఖ్యలో మట్టి ఉపరితల  రోడ్డు దెబ్బతిన్నాయని అన్నారు. అందుకోసం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి  సి ఆర్ ఆర్ 2025-26 గ్రాంట్ కింద పరిపాలన అనుమతి కోసం 15 పనుల కొరకు 20 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కూడిన పనులను చేయటానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క కు కోరారు. మంత్రి సీతక్క సానుకూలంగా  స్పందించి, త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. తూంపల్లి, పాకాల గ్రామానికి వెళ్లి రహదారికి బ్రిడ్జ్ కావాలని, బ్రిడ్జ్ కు కావలసిన విధులు మంజూరు చేయాలని కోరారు. వర్షాకాలంలో తూంపల్లి పాకాల గ్రామాల మధ్య రాకపోకలు ఇబ్బందిగా ఉన్నాయని  రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు.

  • మాలవత్ పూర్ణ కుటుంబానికి పరామర్శ..

సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన మాలవత్ పూర్ణ తండ్రి ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క  , నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ లు మానవత్ పూర్ణ ను, వారి కుటుంబ సభ్యులలో  పరామర్శించడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Grant funds for CRR 2025-26