ఘనంగా పెద్దమ్మ తల్లి పోచమ్మ తల్లి బోనాల పండుగ

  కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ తిమ్మాజివాడి గ్రామంలో ఘనంగా పెద్దమ్మ తల్లి పోచమ్మ తల్లి కి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో అన్ని విధాలుగా పాడిపంట పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కొలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.