కామారెడ్డిలో ఘనంగా 35వ రాజీవ్ జ్యోతి సద్భావనా యాత్రకు స్వాగతం
కామారెడ్డి, బతుకమ్మ : జాతీయ సమైక్యత, మత సామరస్యం, దేశ సమగ్రత సందేశంతో కొనసాగుతున్న 35వ రాజీవ్ జ్యోతి సద్భావనా యాత్రకు కామారెడ్డి పట్టణంలో ఘన స్వాగతం లభించింది. కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు యాత్రలో పాల్గొన్న వారికి స్వాగతం పలికారు. మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ దేశ నిర్మాణానికి చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, జాతీయ ఐక్యత, మత సామరస్యం, దేశ సమగ్రతను బలోపేతం చేయడం...