Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 January 2025, 6:06 pm Posted by : ramakrishna

ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

ఆర్మూర్, బతుకమ్మ :  మండలంలోని చేపూర్ గ్రామంలో శుక్రవారం వెంకటేశ్వర స్వామి, ఆలయంలో ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురకంటీ చిన్నారెడ్డి  విడిసి అధ్యక్షుడు  మేడిపల్లి శ్రీకాంత్ లు వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు ఆలయాలకు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయని, సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారని సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గం’ మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుందని వారన్నారు  ఈ రోజున ఉత్తర ద్వారం గుండా భక్తులు తెల్లవారుజాము నుండి దైవ దర్శనం చేసుకుంటున్నారు.మహావిష్ణువు గరుడ వాహనo పై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని అయన తెలిపారు.ఈ కార్యక్రమంలో.కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్. తాజా మాజీ సర్పంచ్ ఇందూరు సాయన్న. మాజీ ఉప సర్పంచ్  బీసీ సెల్ ఆర్మూర్ మండల అధ్యక్షుడు కటికె శ్రీనివాస్.సొసైటీ మాజీ డైరెక్టర్ సారాంగి శాంతి కుమార్. బొర్రన్న. దుబ్బాక సాయన్న. పట్నం భాస్కర్. కృష్ణ స్వామి. మేడిపల్లి గౌతమ్. ఆర్మూర్ చరణ్. తదితరులు పాల్గొన్నారు.