Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 6:27 pm Posted by : ramakrishna

చిక్కడపల్లిలో ఘనంగా ముగ్గుల పోటీలు…

రుద్రూర్,  బతుకమ్మ :

 

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మచ్కూరి రమేష్, ఉప సర్పంచ్ పిట్ల కళ్యాణ్, పాలకవర్గం ఆధ్వర్యంలో బుధవారం గ్రామ పంచాయితీ ఆవరణలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో 25 మందికి పైగా మహిళలు, యువతులు, బాలికలు పాల్గొని రంగు రంగుల ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి మచ్కూరి జ్వలాశ్రీ, ద్వితీయ బహుమతి బేగరి మహిత్ర తేజశ్రీ, తృతీయ బహుమతి పిట్ల మహతి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో మచ్కూరి హన్మంతు, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు కుర్మరాజు, మోహన్, అంగర్గ శంకర్, నక్క శ్రావణ్, మచ్కూరి సాయన్న, మేహబూబ్, వేముల కరణ్, కార్తీక్, మాడ శ్రవణ్, చాంద్ పాషా, వార్డు సభ్యులు జెల్ల సాయిలు, బేగరి జ్యోతి, మచ్కూరి పద్మ,బేగరి గోపి, కారోబార్ అశోక్, ఫీల్డ్ అసిస్టెంట్ అమ్మోళ్ల సాయిలు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

 

Grand triples competition in Chikkadapalli...
Grand triples competition in Chikkadapalli…