ఆర్ఎస్ పీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు ఘన నివాళి

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   రీవల్యూషనరీ సోషలిస్టు పార్టీ , ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, రైతాంగ ఉద్యమ వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్‌లో ఉన్న ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆమె సేవలను స్మరించుకుంటూ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ పీ జిల్లా కార్యదర్శి కటారి రాములు మాట్లాడుతూ నిజాం పాలనలోని భూస్వామ్య, ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పేదలు, రైతులు, కూలీల...