ఘనంగా సామూహిక వివాహాలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ మొదటి మేయర్ ధర్మపురి సంజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలను నిర్వహించారు. నగరంలోని ప్రగతినగర్ లో ఉచితంగా పేద జంటలకు సంజయ్ వివాహాలు జరిపించారు. నగరంలోని పేద కుటుంబాలకు చెందిన కులాలకు, మతాలకు అతీతంగా 9 జంటలకు వివాహాల క్రతువును నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా గత 20 సంవత్సరాలుగా దాదాపు 250కి పైగా జంటలకు ఉచిత వివాహాలను నిర్వహిస్తున్నట్లు...