Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 6:00 pm Posted by : ramakrishna

ఘనంగా సామూహిక వివాహాలు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ మొదటి మేయర్ ధర్మపురి సంజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలను నిర్వహించారు. నగరంలోని ప్రగతినగర్ లో ఉచితంగా పేద జంటలకు సంజయ్ వివాహాలు జరిపించారు. నగరంలోని పేద కుటుంబాలకు చెందిన కులాలకు, మతాలకు అతీతంగా 9 జంటలకు వివాహాల క్రతువును నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా గత 20 సంవత్సరాలుగా దాదాపు 250కి పైగా జంటలకు ఉచిత వివాహాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Grand-scale collective weddings

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అప్పటి పీసీసీ చీఫ్, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ ఆశయాల మేరకు తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో గుర్తుండిపోవాలని సామూహిక ఉచిత వివాహాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం జరిగిన సామూహిక ఉచిత వివాహ వేడుకలకు రాష్ట్ర పీసీసీ  అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జంటలను ఆశీర్వదించారు. సంజయ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కాటిపల్లి నగేష్ రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, సీనియర్ నాయకులు మానాల మోహన్ రెడ్డి, కౌశపు శరత్, బలరాం, వేణురాజ్, కులాచారి వెంకటేష్, అపర్ణ, పుప్పాల విజయ తదితరులున్నారు.

Grand-scale collective weddings