బతుకమ్మ పిట్లం : జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిట్లం మండల శాఖ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 194 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నీలకంటి సంతోష్ మాట్లాడుతూ భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, ఆడపిల్లల చదువుల కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్య మూర్తి, సామాజిక ఉద్యమ కారణీ అని కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జుక్కల్ నియోజకవర్గం ఇన్చార్జి ఆకుల లక్ష్మణ్ యాదవ్, ఉపాధ్యక్షులు, సన్నపుల మధు కృష్ణ, బాబా గౌడ్, బీసీ సంఘం యూత్ అధ్యక్షుడు కాటేపల్లి హనుమన్లు, మండల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అఫ్రోజ్, సీనియర్ బీసీ నాయకులు మరగ ల దయానంద్, గుర్రపు బాలరాజు, చాకలి అంబదాస్, చుక్క శ్రీనివాస్, సప్తగిరి వెంకన్న, చుక్కల తీర్థం శంకర్, గుర్రపు విట్టల్, మరగల రాజు, గణపురం శేఖర్ మరియు బీసీ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.