ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
నందిపేట్, బతుకమ్మ : నందిపేట్_డొంకేశ్వర్ మండలలో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం వివిధ శాఖల కార్యాలయాలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఆనంద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు అధికారుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యతను వివరిస్తూ, రాజ్యాంగం అందించిన హక్కులు, బాధ్యతలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. మండల అభివృద్ధి అధికారి (ఎండీవో) కార్యాలయంలో ఏం డి ఓ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు....