Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 September 2025, 6:16 pm Posted by : ramakrishna

వైభవంగా శ్రీ సార్వజనిక్ గణేష్ శోభయాత్ర

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ గ్రామంలోని శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి 75 వ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. శనివారం గణేష్ శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివపార్వతుల వేషధారణ, భజనలు, కీర్తనలు, నృత్యాలు, నాసిక్ డోలక్ బ్యాండ్ ల మధ్య ప్రధాన వీధుల గుండా గణేష్ శోభయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాము శర్మ, గణేష్ మండలి అధ్యక్షులు చిదుర వీరేశం, గెంటిల సాయిలు, పత్తి రాము, గెంటిల గంగాధర్, పత్తి లక్ష్మణ్, కర్క అశోక్, గణేష్ మండలి సభ్యులు, యువకులు,  గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Grand procession of Shri Sarvajanik Ganesh