Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 October 2025, 7:06 pm Posted by : ramakrishna

బోధన్‌లో ఘనంగా అమ్మవారి శోభాయాత్ర

బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలోని చక్రేశ్వర శివాలయం నుండి సార్వజనిక్ దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి శోభాయాత్రను సబ్ కలెక్టర్ వికాస్ మాతో ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. శోభాయాత్రలో సీపీ సాయి చైతన్య దర్శించి శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. మహిళలు మంగళహారతులు చేస్తూ పాదయాత్రగా ముందంజలో నడవడం విశేషం. ఇక చిన్న మావంది పెగడపల్లి మధ్య వాగులో అమ్మవారి నిమజ్జనం జరగనుంది. ఇందుకు తహసీల్దార్ విటల్, ఎసిపి శ్రీనివాస్, సిఐ వెంకటనారాయణ, ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు  ఏర్పాట్లు పరిశీలించారు. వాగు వద్ద ఎల్ఈడీ లైట్లు క్రేన్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు నంద్యాల శ్యామ్, పవన్ కుమార్, సందీప్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Grand procession of Goddess Durga in Bodhan