రిపుల్స్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు
బిచ్కుంద, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రంలోని స్థానిక రిపుల్స్ స్కూల్‌లో బతుకమ్మ పండుగ ముందస్తు వేడుకలను అత్యంత వైభవంగా, ఉత్సాహ భరిత వాతావరణంలో నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం రకరకాల రంగురంగుల పూలు, సాంప్రదాయ అలంకరణలతో కోలాహలంగా మారింది. విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, చప్పట్లు, కోలాటం నడుమ ఆటపాటలతో అలరించారు.ఈ సందర్భంగా పాఠశాల ఫౌండర్ అనిల్ కుమార్ పాటిల్ మాట్లాడుతూ.. "తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ప్రకృతిని,...