ఘనంగా మాతాపితా కృతజ్ఞత పూజోత్సవం
బతుకమ్మ, నవీపేట్ : మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో ఆదివారం మాతాపితా కృతజ్ఞత పూజోత్సవం అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాదపూజనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ తిరునగరి శ్రీహరి తల్లిదండ్రుల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. దీనితో విద్యార్థులు ఎమోషనల్ గా ఫీల్ అయి వారు చేసిన తప్పులను వారి తల్లిదండ్రుల ముందు ఉంచి క్షమాపణలు కోరారు. తల్లితండ్రుల విలువ, వారితో మెలగవలసిన తీరును విద్యార్థులకు...