Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 February 2025, 7:56 pm Posted by : ramakrishna

ఘనంగా మాతాపితా కృతజ్ఞత పూజోత్సవం

బతుకమ్మ, నవీపేట్ : మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో ఆదివారం మాతాపితా కృతజ్ఞత పూజోత్సవం అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాదపూజనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ తిరునగరి శ్రీహరి తల్లిదండ్రుల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. దీనితో విద్యార్థులు ఎమోషనల్ గా ఫీల్ అయి వారు చేసిన తప్పులను వారి తల్లిదండ్రుల ముందు ఉంచి క్షమాపణలు కోరారు. తల్లితండ్రుల విలువ, వారితో మెలగవలసిన తీరును విద్యార్థులకు వివరించారు. ఇంట్లో తల్లితండ్రులు పిల్లలతో ఏవిధంగా ఉండాలి, ఎలా మాట్లాడాలో వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పిఆర్టియు జిల్లా అధ్యక్షులు పొద్దుటూరి మోహన్ రెడ్డి మాట్లాడుతూ పరెంట్స్ వర్షిప్ డే లాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, విద్యార్థులు ఎల్లప్పుడూ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులతో స్నేహితులుగా మెలిగి వారిలోని నైపుణ్యాన్ని వెలిగి తీసేలా పిల్లలను ప్రోత్సహించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు తల్లితండ్రులను కంటతడి పెట్టించాయి. ఈ కార్యక్రమంలో పిఆర్టియు జిల్లా జనరల్ సెక్రెటరీ కిషన్, మండల అధ్యక్షులు పెద్దోళ్ళ భూమయ్య, మోటివేషనల్ స్పీకర్స్ మదం మహిపాల్, మాడెకర్ లక్ష్మణ్, శ్రేయ, రాజు, పాఠశాల కరస్పాండెంట్ హన్మాండ్లు,ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఉపాధ్యాయులు సాయి రెడ్డి, నర్సయ్య, శరత్, ప్రకాష్, రాము, ఆంజనేయులు, మహిళ ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Grand parents thanksgiving ceremony