Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2024, 6:05 pm Posted by : ramakrishna

నారాయణ పాఠశాలలో ఘనంగా ప్రీమియర్ లీగ్ ప్రారంభం

ఆర్మూర్,  బతుకమ్మ : ఆర్మూర్ పట్టణం లోని నారాయణ పాఠశాలలో నారాయణ ప్రీమియర్ లీగ్ గురువారం ప్రారంభించామని పాఠశాల ప్రిన్సిపల్ రజని కుమారి తెలిపారు. ఈ ప్రీమియర్ లీగ్ లో భాగంగా విద్యార్థులందరికి రకరకాల క్రీడలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల జీఎం గోపాలరెడ్డి,  ఎంఈఓ రాజ గంగారాం, ఏజీఎం శివాజీ  పాల్గొని, నారాయణ విద్యాసంస్థలు చదువులోనే కాదు అన్ని రంగాలలో ముందుంటాయని తెలిపారు. విద్యార్థుల శారీరక ఎదుగుదలకు క్రీడలు అవసరమని తెలిపారు. ఈ ఆటలలో పాఠశాల కి. ఆర్డినేటర్స్. నరేష్, ఆజిమ, కల్పన, పాఠశాల డీన్ సందీప్, శైలజ,  స్రవంతి,  పాఠశాల ఏఓ నవీన్,  విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.