హైదరాబాద్, బతుకమ్మ : హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 లో శ్రీ చైతన్య హై స్కూల్ ఎదురుగా రామ్మోహన్,అమరేశ్వరి నేతృత్వంలో పికిల్ హౌస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ అన్ని రకాల పికిల్స్,స్నాక్స్,మిర్చి పౌడర్,డ్రై ఫ్రూట్స్,స్పైసెస్ తమ వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు.స్వచ్ఛమైన నువ్వుల నూనెతో తయారుచేసిన పికిల్స్ తమ వద్ద ప్రత్యేకత అన్నారు.వినియోగదారుల మన్ననలను పొందుకొంటూ ఐదో బ్రాంచ్ ను ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు.తమ వద్ద తయారు చేసే పికిల్సులలో ఎటువంటి ప్రిజర్వేషన్స్,కలర్స్ ఉపయోగించకుండా సహజంగా లభించే పదార్థాలతో తాము పికిల్స్ తయారు చేస్తామన్నారు. స్థానికంగా ఉండే ప్రజలు తమ పికిల్ హౌస్ ను సందర్శించి, నాణ్యతలో,రుచిలో ఎక్కడా రాజీ పడకుండా తయారు చేసిన పికిల్స్ ని రుచి చూడాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శివ, రాజశేఖర్, శ్రీనివాస్ బంధుమిత్రులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.