ఘనంగా నెహ్రు జన్మదిన వేడుకలు 

భీమ్ గల్, బతుకమ్మ : భారత మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జన్మదిన వేడుకలను భీమ్ గల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు.  మండల  పార్టీ అధ్యక్షులు భోదిరే స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన  పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కుంట రమేష్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు అనంతరావు, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు వాక మహేష్, యువజన మండల అధ్యక్షులు అవినాష్,మహిళా అధ్యక్షురాలు...