ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణవాది, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109 జయంతి వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ నీతూ కిరణ్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బీ.సి, పద్మశాలి కుల సంఘాల ప్రతినిధులు, తదితరులు వినాయకనగర్ లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన జయంతి...