ఘనంగా శ్రీ జగదాంబ మాత విగ్రహ ప్రతిష్టాపన
ఇందల్వాయి,బతుకమ్మ : అంగరంగ వైభవంగా ఇందల్వాయి మండలంలోని గంగారం తండా లో ఆదివారం శ్రీ జగదాంబ మాత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నిర్వహించిన విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమానికి వివిధ గ్రామాలకు చెందిన గిరిజనులు, గిరిజన పూజారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ కమిటీ చైర్మన్ మోజీరాం నాయక్, మాజీ సర్పంచ్ బలరాం నాయక్, తాండ నాయక్ సబ్ గణేష్ నాయక్, మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ అడుగుజాడల్లో ప్రతి గిరిజన...