ఇందల్వాయి,బతుకమ్మ : అంగరంగ వైభవంగా ఇందల్వాయి మండలంలోని గంగారం తండా లో ఆదివారం శ్రీ జగదాంబ మాత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నిర్వహించిన విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమానికి వివిధ గ్రామాలకు చెందిన గిరిజనులు, గిరిజన పూజారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ కమిటీ చైర్మన్ మోజీరాం నాయక్, మాజీ సర్పంచ్ బలరాం నాయక్, తాండ నాయక్ సబ్ గణేష్ నాయక్, మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ అడుగుజాడల్లో ప్రతి గిరిజన వ్యక్తి వెళ్లాలని ఆలయ కమిటీ చైర్మన్ మోజీరామ్ నాయక్ పిలుపునిచ్చారు. ఎన్నో దశాబ్దాల క్రితం తండాలో జగదంబ మాత ఆలయం నిర్మించాలని సంకల్పించిన అని వార్య కారణాలవల్ల నిర్మించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గంగారం తండా పరిధిలో నూతన శ్రీ జగదంబ మాత ఆలయం నిర్మించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గుడి నిర్మాణంలో తండాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కృషి అభినందనీయమన్నారు. పిర్సింగ్ నాయక్, శంకర్ నాయక్, ప్రతాప్, హరిలాల్ కృషితో ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. తండాలోని ప్రతి ఒక్కరు కృషివల్లే ఈ దేవాలయం నిర్మించామని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాండ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేసిన సందర్భంగా వారందరికీ ఆలయ కమిటీ తరఫున గంగారం తండా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మోజీరాం నాయక్, కోశాధికారి దేవి సింగ్ నాయక్, తాండ పెద్దమనిషి గణేష్ నాయక్, పి ఆర్ టి యు అసోసియేట్ అధ్యక్షులు పీర్ సింగ్ నాయక్, మాజీ సర్పంచ్ బలరాం నాయక్, ధూమ నాయక్, గంగాధర్, హరిలాల్, మోహన్ నాయక్, శంకర్ నాయక్, జే.మోహన్ నాయక్, లక్ష్మణ్ నాయక్, లచ్చిరాo నాయక్ తోపాటు వివిధ గ్రామాలకు చెందిన బంజారా సోదరులు, పూజారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
