Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 8:32 pm Posted by : ramakrishna

కామారెడ్డిలో ఘనంగా బీజేపీ జిల్లా కార్యాలయం ప్రారంభం

 

. . . వర్చువల్‌గా ప్రారంభించిన జాతీయ అధ్యక్షుడు నితిన్ నభీన్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నభీన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ఆధ్వర్యంలో నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూల తోరణాలతో అందంగా అలంకరించిన కార్యాలయ ప్రాంగణంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర నాయకులు మురళీధర్, బాణాల లక్ష్మారెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం సమావేశ మందిరంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నభీన్ అందించిన సందేశాన్ని నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు కాషాయ కండువాలు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. నూతన కార్యాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నాయకులు, కార్యకర్తలు గ్రూప్ ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, నూతన జిల్లా కార్యాలయం ద్వారా జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని, పార్టీ విస్తరణకు ఇది కేంద్ర బిందువుగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Grand inauguration of the BJP district office in Kamareddy.