Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 September 2024, 11:06 pm Posted by : ramakrishna

అమెరికాలోని డేట్రాయ్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం వేడుకలు 

నిజామాబాద్, బతుకమ్మ  : యూ.ఎస్.ఏ లోని డేట్రాయ్ నగరంలో గణేష్ పండుగ ఉత్సవాలను ప్రవాస భారతీయులు ఘనంగా జరుపుకున్నారు.నవరాత్రుల్లో చివరి రోజు గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకోవడంతో పాటు స్వదేశంలో లాగా కన్నుల పండువగా నిమజ్జనం నిర్వహించారు.

Grand Ganesh Namazjanam celebrations in Detroit, America

భారతీయ సాంప్రదాయ పద్ధతిలో ప్రతి రోజూ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు చివరి రోజు లడ్డూ వేలం పాటను నిర్వహించారు. నిజామాబాద్ కి చెందిన యలమంచిలి రామ్మోహన రావు కుమారుడు సాయి తేజ అతని స్నేహితుల బృందం లడ్డూ వేలం పాటలో 1.25,000 వేల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు.ఈ సందర్బంగా గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు నిజామాబాద్ నగరానికి చెందిన యలమంచిలి సాయి తేజ మాట్లాడుతూ మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తూ మన ముఖ్యమైన పండగలను ఘనంగా జరుపకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నుంచి విజిట్ కు వెళ్లిన యలమంచిలి రామ్మోహన్ దంపతులతో పాటు పలువురు హిందూ కుటుంబాలు పాల్గొన్నాయి.

Grand Ganesh Namazjanam celebrations in Detroit, America