Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 7:24 pm Posted by : ramakrishna

ఘనంగా అన్నదాన కార్యక్రమం

 

కమ్మర్ పల్లి, బతుకమ్మ :

గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటిరోజు వినాయకుడి మండపం వద్ద ఘనంగా అన్నదానం నిర్వహించారు. కమ్మర్ పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో సోమవారం సన్ రైజ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.ముందుగా స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ దాదాపు పదిహేను సంవత్సరాల నుండి వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజే అన్నదాన కార్యక్రమం చేపడుతామని తెలిపారు.

Grand food donation program...
Grand food donation program…