యోగ గురు దంపతులకు ఘన సన్మానం

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   గత 25 సంవత్సరాలుగా యోగ సాధన చేస్తూ ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్న యోగ గురువులను సోమవారం ఘనంగా సన్మానించారు. గురు పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని అర్సపల్లిలో యోగ గురు దంపతులు యోగారత్న ఎక్కొండ ప్రభాకర్, లక్ష్మీ దంపతులను నాలెడ్జ్ పార్క్ పాఠశాలలోని మైనార్టీ యోగ సంఘ సభ్యులు వారి నివాసంలో కలిసి సత్కరించారు. గురుదక్షిణగా పండ్లు, ఫలాలు, పట్టు వస్త్రాలు అందించి తమ గౌరవాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మైనార్టీ యోగ సంఘ...