Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 7:32 pm Posted by : ramakrishna

యోగ గురు దంపతులకు ఘన సన్మానం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గత 25 సంవత్సరాలుగా యోగ సాధన చేస్తూ ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్న యోగ గురువులను సోమవారం ఘనంగా సన్మానించారు. గురు పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని అర్సపల్లిలో యోగ గురు దంపతులు యోగారత్న ఎక్కొండ ప్రభాకర్, లక్ష్మీ దంపతులను నాలెడ్జ్ పార్క్ పాఠశాలలోని మైనార్టీ యోగ సంఘ సభ్యులు వారి నివాసంలో కలిసి సత్కరించారు. గురుదక్షిణగా పండ్లు, ఫలాలు, పట్టు వస్త్రాలు అందించి తమ గౌరవాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మైనార్టీ యోగ సంఘ అధ్యక్షులు, రిటైర్డ్ ప్రిన్సిపల్ హబీద్ అలీ మాట్లాడుతూ యోగ సాధన ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహిస్తున్న యోగ గురువుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాలెడ్జ్ పార్క్ పాఠశాల వ్యవస్థాపకుడు ముజ్జిబ్ బాయ్, అగ్రికల్చర్ రిటైర్డ్ అధికారి షాహిద్ సాబ్, గౌస్, మునీర్, రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ అహ్మద్, వహాబ్, సలీమ్, మహమూద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే యోగ బృందం సభ్యులు హాజరై యోగ గురు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.