Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 8:49 pm Posted by : ramakrishna

డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌గా బాధ్యతలు స్వీకరించిన రహిముద్దీన్, రాహుల్‌లకు ఘన సన్మానం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లా కేంద్రంలో నూతనంగా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బాధ్యతలు స్వీకరించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రహిముద్దీన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాహుల్‌లను జిల్లా కోర్టు న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు జగన్ మోహన్ గౌడ్, డాక్టర్ పులి జైపాల్, పిల్లి శ్రీకాంత్, రత్నాకర్ రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతల్లో రహిముద్దీన్, రాహుల్‌లు విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం సన్మానితులు మాట్లాడుతూ, తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ న్యాయ వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, న్యాయ సిబ్బంది పాల్గొన్నారు.