హెచ్ఎఫ్ఎకి ఎంపికైన బోర్గాం విద్యార్థిని నక్షత్రకు ఘన సన్మానం

  బోర్గాం(పి), బతుకమ్మ :   5వ డివిజన్ పరిధిలోని బోర్గాం(పి) గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్ఎస్) విద్యార్థిని మంగోలు నక్షత్ర ప్రతిష్టాత్మక హైదరాబాద్ ఫుట్‌బాల్ అకాడమీ (హెచ్ఎఫ్ఎ) కి ఎంపిక కావడం స్థానికంగా ఆనందోత్సాహాలకు కారణమైంది. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న నక్షత్ర తన ప్రతిభతో ఈ అరుదైన అవకాశాన్ని అందుకోవడం గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా 5వ డివిజన్ గ్రామ ప్రజల తరపున కార్పొరేటర్‌తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కలిసి నక్షత్రను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ...